Hot Topics

వారెవ్వా ఏం జాతకం రా బాబు.. పుడితే ఈ నెంబర్‌లోనే పుట్టాలి!

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo. Aliquam non leo id magna vulputate dapibus. Curabitur a porta metus. In viverra ipsum nec vehicula pharetra. Proin egestas nulla velit, id faucibus mi ultrices et.

జ్యోతిష్యశాస్త్రంలో సంఖ్యాశాస్త్రానికి కూడా చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంటుంది. అయితే న్యూమరాలజీ ప్రకారం, నిర్దిష్టమైన తేదీలో జన్మించిన వారు ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటారు. అయితే ఒక తేదీలో జన్మించి వారి లైఫ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందంట. ముఖ్యంగా ఏం జాతకం రాబాబు, పుడితే ఈ తేదీలోనే పుట్టాలి అనుకుంటారంట. ఇంతకీ వారు ఎవరో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే!

ఎవరు అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం 2వ తేదీన జన్మిస్తారో వారు చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారంట. అంతే కాకుండా వీరు చాలా భిన్నంగా మంచి తెలివితేటలను కలిగి ఉంటారని చెబుతున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. అందువలన ఈ తేదీలో జన్మించిన వారు అందరికీ ప్రియమైనవారిగా ఉంటారు.

సంఖ్యాశాస్త్రం ప్రకారం రెండవ తేదీన జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అని చెబుతారు. చంద్రుడు రెండవ ఇంటికి అధిపతి. అందువలన వీరు రూట్ 2తోనే వస్తారు. వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ప్రతి విషయంలో వీరిని లక్కు వెతుక్కుంటూ వస్తుంది. డబ్బు సంపాదించే కల వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ రంగంలో ఉన్నా, అందులో దూసుకెళ్తారు. చాలా తక్కువ సమయంలోనే ఉన్నతస్థాయికి ఎదుగుతారు.

వీరికి కుటుంబంలో, పని చేసే చోట కూడా మంచి సపోర్ట్ ఉంటుంది. ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు. అంతే కాకుండా అందరితో చాలా సులభంగా కలిసిపోయే స్వభావం ఉంటుంది. అందుకే వీరు అంటే చాలా మంది ఇష్టం ఉంటుంది. అలాగే కొన్ని సార్లు ఇది ఇతరులలో అసూయను కూడా కలిగిస్తుంది. ఎవరు అయితే రెండో తేదీన జన్మించారో వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చినప్పటికీ, వీరికి భావోద్వేగ గుణం మైనస్ అని చెప్పాలి.

వీరికి భావోద్వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఎమోషన్ అవ్వడమే కాకుండా, చాలా ఆలోచిస్తుంటారు. దీని వలన కొన్ని సార్లు వీరు పనులపై అంతగా దృష్టి పెట్టలేరు. అంతే కాకుండా వీరి ఎమోషనల్ బాండింగ్ వలన వీరు మంచి మంచి అవకాశాలను కూడా వదులుకునే ఛాన్స్ ఉంది. వీరు ఎంత ఎమోషనల్‌గా ఉంటారో, ఇతరుల బాధలను కూడా అంతే ఎక్కవగా పట్టించుకుంటారు. వారి బాధ వీరి బాధలా ఫీల్ అయిపోతారు.

అదే విధంగా రెండో తేదీన జన్మించిన వ్యక్తులకు ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కుటుంబానికి , స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Tags :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent News